బైరెడ్డిపల్లిలో RMP వైద్యం పేరుతో ఘోరం.. 10 ఏళ్ల బాలిక మృతి! విచారణకు DMHO రంగంలోకి!

Header Banner

బైరెడ్డిపల్లిలో RMP వైద్యం పేరుతో ఘోరం.. 10 ఏళ్ల బాలిక మృతి! విచారణకు DMHO రంగంలోకి!

  Sat Feb 01, 2025 16:28        Others

బైరెడ్డిపల్లి మండలంలో RMP వైద్యం వికటించి 10 ఏళ్ళ బాలిక మృతి చెందినట్టు వచ్చిన ఆరోపణలపై చిత్తూరు జిల్లా DMHO డాక్టర్ సుధారాణి నేరుగా రంగంలోకి దిగి నెలకొన్న ఆరోపణలపై జిల్లా అధికారులు, మండల అధికారుల నేతృత్వంలో విచారణ చేపట్టి RMP, PMOలకు కఠినమైన చర్యలు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా లోకల్ 18తో మాట్లాడుతూ బైరెడ్డిపల్లి మండలంలోని మారుమూల గ్రామమైన టి.ఎన్.కుప్పంలో 10 ఏళ్ళ బాలిక వైష్ణవి గత మూడు రోజులుగా RMP వైద్యం చేసుకొని కొద్దిగా తగ్గుముఖం పట్టడం జరిగింది. ఎక్కువ నీరసంగా ఉన్నదని మెరుగైన వైద్యం కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి వెళ్తున్న తరుణంలో మృతి చెందిందని చిన్నారి తండ్రి రాజేష్ వెల్లడించారని తెలిపారు. అదేవిధంగా RMP, PMPలు దయచేసి మీ జాబ్ కార్డులో ఉన్న రూల్స్ ని వైలెన్స్ చేయకూడదన్నారు. ప్రథమ చికిత్సలు తప్ప వేరే ఎటువంటి చికిత్సలు నిర్వహించకూడదన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు, గర్భిణీలకు చికిత్సలు నిర్వహించకూడదన్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 


టాస్క్ ఫోర్స్ కమిటీ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఆర్.ఎం.పి, పి.ఎం.పి. లకు మీటింగ్ నిర్వహించడమైనది. డాక్టర్ విజయ్ చందర్, డాక్టర్ అరుణ్ మాట్లాడుతూ RMP, PMP లు క్లినిక్ నందు ఇంజక్షన్ సెలైన్లు ఇవ్వకూడదు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి అన్నారు. చిన్నపిల్లలు, గర్భవతులకు, చికిత్స చేయరాదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించాలన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదన్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆక్ట్ 1956 సెక్షన్ 15 (2)a15 (2) బి ప్రకారము శిక్షార్హులు అన్నారు. ఎంపీడీవో రాజేంద్ర బాలాజీ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పరశురాముడు మాట్లాడుతూ ప్రజలకు ప్రాణహాని కలిగించే వైద్యం చేయకూడదు అలా చేసిన ఎడల మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ క్లినిక్ ను సీజ్ చేస్తుందన్నారు. 15 రోజులకు ఒకసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీచే క్లినిక్స్ తనిఖీలు ఉంటాయని తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

  

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RMP #medication #chittor #todaynews #flashnews #latestupdate